Welcome to our Basha Honey store website!
Close
#1-139 Mamillapalli Road,Dandamudi Ponnur, Guntur,ANDHRA PRADESH-522316
+91 81427 62222

తేనె గురించిన విషయాలు

స్వచ్ఛమైన తేనె యొక్క లక్షణాలు

  • స్వచ్ఛమైన తేనెకు పూతను బట్టి రంగు, రుచి, వాసన, చిక్కదనం మారుతూ ఉంటాయి.

  • కొన్ని పూతల ద్వారా వచ్చే తేనె చలి కాలంలో గడ్డ కడుతుంది. అది దాని సహజ గుణం. 40°C ఉష్ణోగ్రతలో ఒకటి లేదా రెండు రోజులు ఉంచినప్పుడు, స్వచ్ఛమైన తేనె కరిగిపోతుంది.

  • కొన్ని పూతల తేనెకు ఎండా కాలంలో నురుగు వస్తుంది. ఉదాహరణకు దోస మరియు నువ్వుల తేనె.

  • కొన్ని పూతల నుంచి వచ్చిన తేనెకు లేత రంగు, కొన్నిటికి ముదురు రంగు ఉంటుంది. ఉదాహరణకు దోస మరియు నువ్వుల తేనె లేత రంగులో ఉంటుంది, ప్రొద్దు తిరుగుడు మరియు మల్టీ ఫ్లోరా తేనె ముదురు రంగులో ఉంటుంది. కానీ స్వచ్ఛమైన తేనె అవటం వలన, వాటి పౌష్టిక విలువలు మారవు.

  • కొన్ని పూతల తేనె పల్చగా, కొన్ని చిక్కగా ఉండటం జరుగుతుంది. పల్చగా ఉన్న తేనె నీటిలో వేసిన కొద్ది సమయానికే కరిగిపోతుంది. త్వరగా కరిగిపోయిన తేనె కల్తీ తేనె అని అనుకోవటం పొరపాటు.

  • అదేవిధంగా స్వచ్ఛమైన తేనె యొక్క వాసన కూడా పూతను బట్టి మారుతుంది.

స్వచ్ఛమైన తేనె గురించిన అపోహలు

  • స్వచ్ఛమైన తేనెను కుక్క నాకదు అనేది అవాస్తవం.

  • కాగితం మీద తేనెను రాసి వెలిగిస్తే మండుతుంది అనుకోవటం అపోహ.

  • గోరు వెచ్చని నీళ్లలో తేనెను వేస్తే కరగదు అనుకోవటం అపోహ.

  • జుట్టుకి తేనె రాస్తే తెల్లబడుతుంది అన్నది అవాస్తవం.

  • స్వచ్ఛమైన తేనెకు చీమలు పట్టవు అన్నది కూడా కేవలం అపోహ మాత్రమే.