Welcome to our Basha Honey store website!
Close
#1-139 Mamillapalli Road,Dandamudi Ponnur, Guntur,ANDHRA PRADESH-522316
+91 81427 62222

తరచుగా అడిగే ప్రశ్నలు

365 రోజులూ ఒకే ప్రాంతంలో పూత ఉండదు. అందువల్ల తేనె రాదు. మేము తేనె పెట్టెలు పూతను బట్టి ఒకచోట నుంచి మరో చోటకి 40 రోజులకు ఒకసారి మార్చడం జరుగుతుంది. అలా పూత మారిన ప్రతిసారి తేనె యొక్క గుణాలు మారుతూ ఉంటాయి. రంగు, రుచి, వాసన, చిక్కదనం, గడ్డకట్టే గుణం అన్నీ మారతాయి.తేనెను వేడిచేసి రసాయనాలను కలపడం చేస్తే ఎప్పుడూ ఒకే రంగు, రుచి, వాసన, ఉంటుంది. చలికాలంలో గడ్డ కట్టడం కూడా జరగదు. కానీ వేడిచేయడం వల్ల తేనెలోని మినరల్స్‌ మరియు న్యూట్రియంట్స్‌తగ్గిపోతాయి. రసాయనాలు కలపడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. అందువలన బాషా తేనె సహజంగా వచ్చిన తేనెను కేవలం వడకట్టి మాత్రమే మీకు అందిస్తుంది.

కొన్ని పూతల మీద వచ్చే తేనె చలికాలంలో గడ్డ కడుతుంది. కొబ్బరినూనె ఏవిధంగా చలికాలంలో గడ్డ కడుతుందో
అదే విధంగా ఆవాలు, ఒలుసుల పూత మరియు అటవీ ప్రాంతంలో వచ్చే తేనె గడ్డ కడుతుంది.స్వచృమైన తేనె యొక్క మెల్టింగ్‌ పాయింట్‌  40°C ఉష్ణోగ్రత. అందువలన గడ్డకట్టిన తేనెను ఎండాకాలంలో 40°C
కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఎండలో పెడితే కరిగిపోతుంది.చలికాలంలో కూడా గడ్డకట్టిన తేనెను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.స్పూనుతో తీసుకుని నీళ్లలో కలుపుకోవచ్చు, చక్కగా కరిగిపోతుంది. మీరు ఈ వివరాలను ఇంటర్నెట్లో కూడా తెలుసుకోవచ్చు.

కొబ్బరి నూనె, ఆముదం, ఆవ నూనె, ప్రొద్దు తిరుగుడు మొదలగు నూనెలకు ఏ విధంగా వాసన వేరుగా ఉంటుందో అదే విధంగా పూతను బట్టి స్వచ్భమైన తేనె వాసన మారుతుంది. 365 రోజులూ ఒకే పూత తేనె దొరకదు కాబట్టి మీకు కావలసిన తేనె మార్చి పంపటం జరగదు. అన్ని రకాల పూతల తేనెను ఆస్వాదించి మాకు సహయపడగలరు.

దోస పూత మీద మరియు నువ్వుల పూత మీద వచ్చిన తేనెలో సాధారణంగా తెల్లటి నురుగు వస్తుంది. అది ఆ పూతల వల్ల వచ్చే సహజగుణం. తేనె మీద వచ్చే నురుగుని ఎటువంటి ఇబ్బంది లేకుండా తినొచ్చు మరియు త్రాగవచ్చు. ముఖంపై రాసుకోవడం వల్ల కూడా లాభాలు ఉంటాయి, చర్మం మృదువుగా మారుతుంది.

చాలామందికి మామిడి పళ్ళు చాలా ఇష్టం, కొంతమందికి సీతాఫలం చాలా ఇష్టం. కానీ 365 రోజులూ మామిడి పళ్లు లేదా సీతాఫలాలు కావాలంటే దొరకవు. అదే విధంగా ఒకే పూత మీద వచ్చే తేనె ఎప్పుడూ కావాలంటే సాధ్యపడటం కొంచెం కష్టం. అన్ని రకాల పూతల తేనెను ఆస్వాదించి మాకు సహయపడగలరు.

స్వచ్చమైన తేనె పూతను బట్టి రంగు మారుతూ ఉంటుంది. బాషా తేనె స్వచ్చమైన తేనె, మీకు కేవలం దానిని వడకట్టి అందివ్వడం జరుగుతుంది. ఎటువంటి కృత్రిమమైన రంగులు కలపడం జరగదు.

బాషా తేనె ప్యాకింగ్‌ కోసం వాడుతున్న బాటిల్స్‌ ఫుడ్‌ గ్రేడ్‌ బాటిల్స్‌. అందులో ప్యాక్‌ చేయడం వల్ల తేనెకు ఎటువంటి నష్టం కలగదు. గాజు బాటిల్స్‌ లో ప్యాక్‌ చేయడం వల్ల ట్రాన్స్స్‌ర్ట్‌ ఇబ్బందులు చాలా వస్తాయి. మరియు బరువు పెరగడం వల్ల షిప్పింగ్‌ చార్జెస్‌ కూడా పెరుగుతాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఫుడ్‌ గ్రేడ్‌ బాటిల్స్‌ లో ప్యాక్‌ చేస్తున్నాము. దయచేసి సహకరించగలరు.

దాదాపు ముప్పై సంవత్సరముల నుండి మేము తేనెటీగలను పెంచుతున్నాము. ఒకే ఒక్క తేనె పెట్టెతో బాషాతేనె మొదలయింది. ఎంతో కృషితో నిజాయితీతో బాషా తేనె వృద్ధిలోకి వచ్చింది. కేవలం నిజాయితీగా ఉండడం వలనే బాషా తేనెను డా. మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రోత్సహించారు. ఒక్క సారి మేము నిజాయితీగా లేకపోయినా డా. మంతెన సత్యనారాయణ రాజు గారికి తెలిసిపోతుంది. కారణం ఉపవాసం ఉండేవాళ్ళకి స్వచ్చమైన తేనెతో మాత్రమే రావలసిన ఫలితాలు వస్తాయి. కావున ఎప్పుడూ బాషా తేనెలో కర్తీ జరగలేదు, మరెప్పుడూ జరగదు కూడా. బాషా గారి ఏకైక ఆశయం అందరికీ స్వచ్చమైన తేనెను అందివ్వడం.