FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)
365 రోజులూ ఒకే ప్రాంతంలో పూత ఉండదు. అందువల్ల తేనె రాదు. మేము తేనె పెట్టెలు పూతను బట్టి ఒకచోట నుంచి మరో చోటకి 40 రోజులకు ఒకసారి మార్చడం జరుగుతుంది. అలా పూత మారిన ప్రతిసారి తేనె యొక్క గుణాలు మారుతూ ఉంటాయి. రంగు, రుచి, వాసన, చిక్కదనం, గడ్డకట్టే గుణం అన్నీ మారతాయి. తేనెను వేడిచేసి రసాయనాలను కలపడం చేస్తే ఎప్పుడూ ఒకే రంగు, రుచి, వాసన, ఉంటుంది. చలికాలంలో గడ్డ కట్టడం కూడా జరగదు. కానీ వేడిచేయడం వల్ల తేనెలోని మినరల్స్ మరియు పౌష్టిక విలువలు తగ్గిపోతాయి. రసాయనాలు కలపడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. అందువలన బాషా తేనె సహజంగా వచ్చిన తేనెను కేవలం వడకట్టి మాత్రమే మీకు అందిస్తుంది.
Same flower is not available for all the 365 days in a year. That is why we don’t get the same honey every time. Based on the flowering season, migration of bee boxes is done. Hence, every time the flowering season changes, the colour, taste, smell, and density of the honey collected will also change. If we heat and process the honey, we can get the same type of honey every time and crystallisation also will not happen. But that will kill all the nutritional values of honey. Hence, we at Basha Honey strive to provide 100% raw and natural honey.
ఏ పూతల విత్తనాల నుండి నూనె వస్తుందో, ఆ పూతల నుండి వచ్చిన తేనె సహజంగానే గడ్డ కడుతుంది. ఉదాహరణకి కొబ్బరినూనె ఏవిధంగా గడ్డ కడుతుందో అదే విధంగా ఆవాల పూత, ఒలుసుల పూత, కానుగ పూత, ప్రొద్దుతిరుగుడు పూతల నుంచి వచ్చిన తేనె మరియు అటవీ ప్రాంతంలో వచ్చే తేనె గడ్డ కడుతుంది.
స్వచ్ఛమైన తేనె యొక్క మెల్టింగ్ పాయింట్ 40°C ఉష్ణోగ్రత. అందువలన గడ్డకట్టిన తేనెను ఎండాకాలంలో 40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఎండలో పెడితే కరిగిపోతుంది. చలికాలంలో కూడా గడ్డకట్టిన తేనెను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. స్పూనుతో తీసుకుని నీళ్లలో కలుపుకోవచ్చు, చక్కగా కరిగిపోతుంది.
మీరు ఈ వివరాలను ఇంటర్నెట్లో కూడా తెలుసుకోవచ్చు.
It is natural for honey collected from a few flowers to be crystallised. Even coconut oil gets crystallised. For example, honey collected from flowers from wild regions, honey collected from oil seed plants such as seasame, sunflower gets crystallised.
To distinguish honey and sugar syrup, you can test whether the crystallised honey is getting melted in the hot sun at 40°C. If it does, then we can clearly say that it is raw honey. If not, it is sugar syrup. You can also use a spoon and use the crystallised raw honey without any worry.
You can even educate yourself by reading over the internet.
కొబ్బరి నూనె, ఆముదం, ఆవ నూనె, ప్రొద్దు తిరుగుడు మొదలగు నూనెలకు ఏ విధంగా వాసన వేరుగా ఉంటుందో అదే విధంగా పూతను బట్టి స్వచ్భమైన తేనె వాసన మారుతుంది. 365 రోజులూ ఒకే పూత తేనె దొరకదు కాబట్టి మీకు కావలసిన తేనె మార్చి పంపటం జరగదు. అన్ని రకాల పూతల తేనెను ఆస్వాదించి మాకు సహయపడగలరు.
Honey collected from different flowers has different smells. Coconut oil, Sesame oil, Sunflower oil will all have different smells, honey is similar. All 365 days we cannot get the same type of honey as the flowering season keeps changing. Please enjoy the honey collected from all seasons for your own health benefits.
దోస పూత మీద మరియు నువ్వుల పూత మీద వచ్చిన తేనెలో సాధారణంగా తెల్లటి నురుగు వస్తుంది. అది ఆ పూతల వల్ల వచ్చే సహజగుణం. తేనె మీద వచ్చే నురుగుని ఎటువంటి ఇబ్బంది లేకుండా తినొచ్చు మరియు త్రాగవచ్చు. ముఖంపై రాసుకోవడం వల్ల కూడా లాభాలు ఉంటాయి, చర్మం మృదువుగా మారుతుంది.
No. It is not damaged. Honey collected from Cucumber and Sesame seed flowers has this natural property. This white foam is healthy and does not have any bad impact on us. In fact, you can happily taste it. You may as well apply this white foam on your face for the smoothness of your skin.
స్వచ్ఛమైన తేనె పూతను బట్టి రంగు మారుతూ ఉంటుంది. బాషా తేనె స్వచ్ఛమైన తేనె, మీకు కేవలం దానిని వడకట్టి అందివ్వడం జరుగుతుంది. ఎటువంటి కృత్రిమమైన రంగులు కలపడం జరగదు.
The Color of honey changes because it is the natural property of honey based on the flowering season. Because we provide raw honey without any preservatives or added flavours, our honey changes based on every season.
బాషా తేనె ప్యాకింగ్ కోసం వాడుతున్న బాటిల్స్ ఫుడ్ గ్రేడ్ బాటిల్స్. అందులో ప్యాక్ చేయడం వల్ల తేనెకు ఎటువంటి నష్టం కలగదు. గాజు బాటిల్స్ లో ప్యాక్ చేయడం వల్ల రవాణా చేసేటపుడు ఇబ్బందులు చాలా వస్తాయి. మరియు బరువు పెరగడం వల్ల షిప్పింగ్ చార్జెస్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఫుడ్ గ్రేడ్ బాటిల్స్ లో ప్యాక్ చేస్తున్నాము. దయచేసి సహకరించగలరు.
We are using food grade plastic bottles. Packing in our bottles will not create any problem with honey. You can transfer honey to glass bottles once you receive them if you would like to do so. Also, packing in glass bottles will cause problems in transport and courier and the charges of honey will also increase. Keeping all this in mind, we have been using plastic bottles. Kindly cooperate.
చాలామందికి మామిడి పళ్ళు చాలా ఇష్టం, కొంతమందికి సీతాఫలం చాలా ఇష్టం. కానీ 365 రోజులూ మామిడి పళ్లు లేదా సీతాఫలాలు కావాలంటే దొరకవు. అదే విధంగా ఒకే పూత మీద వచ్చే తేనె ఎప్పుడూ కావాలంటే సాధ్యపడటం కొంచెం కష్టం. అన్ని రకాల పూతల తేనెను ఆస్వాదించి మాకు సహయపడగలరు.
We like Mango fruits, Seethaphal fruits. But can we get the same fruit throughout the year? No. Just like that, we cannot provide you the same honey throughout they year. Please cooperate by enjoying honey provided in all the seasons.
దాదాపు ముప్పై సంవత్సరముల నుండి మేము తేనెటీగలను పెంచుతున్నాము. ఒకే ఒక్క తేనె పెట్టెతో బాషాతేనె మొదలయింది. ఎంతో కృషితో నిజాయితీతో బాషా తేనె వృద్ధిలోకి వచ్చింది. కేవలం నిజాయితీగా ఉండడం వలనే బాషా తేనెను డా. మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రోత్సహించారు. ఒక్క సారి మేము నిజాయితీగా లేకపోయినా డా. మంతెన సత్యనారాయణ రాజు గారికి తెలిసిపోతుంది. కారణం ఉపవాసం ఉండేవాళ్ళకి స్వచ్ఛమైన తేనెతో మాత్రమే రావలసిన ఫలితాలు వస్తాయి. కావున ఎప్పుడూ బాషా తేనెలో కల్తీ జరగలేదు, మరెప్పుడూ జరగదు కూడా. బాషా గారి ఏకైక ఆశయం అందరికీ స్వచ్ఛమైన తేనెను అందివ్వడం.
We have been doing beekeeping for 30+ years now. Basha Honey started with one bee box. With a lot of effort and honesty, Basha Honey flourished today. The day we break our honesty, followers in the Dr. Manthena Satyanarayana Raju Aarogyalayam will stop seeing benefits with our honey and that will be transparent. Naturopathy followers when they are on honey fasting, they will be able to see health benefits only when they use raw and natural honey. Basha Honey has never been adulterated, and will never be. Mr. Basha’s sole priority is to provide 100% raw and natural honey.
Get Your Honey Now !
We offer the best quality honey without using any artificial colors or flavors in Honey.